Song Title: Lingashtakam Song Lyrics In English – S.P. Balasubrahmaniam | Singer: S.P. Balasubrahmaniam | Composer: S.P. Balasubrahmaniam | Music: S.P. Balasubrahmaniam | Lyrics Writer: Sri Adi Shankaracharya | Lingastakam Song Lyrics In English – S.P. Balasubrahmaniam | songlyriics.com
లింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము. లింగాష్టక స్తోత్రం హిందువులచే ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో ఒకటి. లింగాష్టకం మొత్తం ఎనమిది చరణాలను కలిగి ఉంటుంది, ఇందులో ప్రతి చరణము పరమశివుడిని స్తుతిస్తూ వ్రాయబడి ఉంటుంది. లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మరియు చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం. లింగాష్టకం, లింగాష్టకం యొక్క తెలుగు అర్థం క్రింద ఇవ్వబడినది.
Singer | S.P. Balasubrahmaniam |
Composer | S.P. Balasubrahmaniam |
Music | S.P. Balasubrahmaniam |
Song Writer | Sri Adi Shankaracharya |
Lingastakam Song Lyrics In Telugu – S.P. Balasubrahmaniam
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగం ।
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥
దేవమునిప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణదర్పవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥
సర్వసుగన్ధిసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగం ।
సిద్ధసురాసురవన్దిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥
కనకమహామణిభూషిత లింగం
ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగం ।
సంచితపాపవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
అష్టదలోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగం ।
అష్టదరిద్రవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
ఇతి శ్రీ లింగాష్టకం ||
Lingastakam Song Lyrics In English – S.P. Balasubrahmaniam
brahmamurāri surārcita liṅgaṁ
nirmala bhāsita śōbhita liṅgam |
janma jaduḥkha vināśaka liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 1 ||
dēvamuni pravarārcita liṅgaṁ
kāmadahana karuṇākara liṅgam |
rāvaṇadarpa vināśana liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 2 ||
sarvasugandha sulēpita liṅgaṁ
buddhivivardhana kāraṇa liṅgam |
siddhasurāsura vandita liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 3 ||
kanakamahāmaṇi bhūṣita liṅgaṁ
phaṇiparivēṣṭita śōbhita liṅgam |
dakṣhasuyajña vināśana liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 4 ||
kuṅkuma chandanalēpita liṅgaṁ
paṅkajahāra suśōbhita liṅgam |
sañchitapāpa vināśana liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 5 ||
dēvagaṇārchita sēvita liṅgaṁ
bhāvairbhakti bhirēvacha liṅgam |
dinakarakōṭi prabhākara liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 6 ||
aṣṭadalō parivēṣṭita liṅgaṁ
sarvasamudbhava kāraṇa liṅgam |
aṣṭadaridra vināśana liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 7 ||
suragurusuravara pūjita liṅgaṁ
suravanapuṣpa sadārcita liṅgam |
parāmapadam paramātmaka liṅgaṁ
tatpraṇamāmi sadā śiva liṅgam || 8 ||
liṅgāṣṭakamidaṁ puṇyaṁ yaḥ paṭēcchiva sannidhau |
śivalōkamavāpnōti śivēna saha mōdatē ||
లింగాష్టకం, లింగాష్టకం యొక్క తెలుగు అర్థం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[1]
దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు ఋషులు పూజించే లింగం
కామదహన కరుణాకర లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం
రావణ దర్ప వినాశన లింగం
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[2]
సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[3]
కనక మహామణి భూషిత లింగం
బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[4]
కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ గంధము పూయబడిన లింగం
పంకజ హార సుశోభిత లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం
సంచిత పాప వినాశన లింగం
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[5]
దేవగణార్చిత సేవిత లింగం
దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావైర్భక్తిభిరేవచ లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[6]
అష్టదళోపరివేష్టిత లింగం
ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[7]
సురగురు సురవర పూజిత లింగం
దేవతల గురువు దేవతలు పూజించే లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
పరాత్పరం పరమాత్మక లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[8]
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది